Site icon NTV Telugu

RGV: కాస్ట్యూమ్ నచ్చక బీచ్‌లో హీరోయిన్ చేసిన పనికి షాక్ అయ్యాం..

Rgv

Rgv

RGV: సినిమా ప్రేమికులకు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్స్పిరేషన్‌తో సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి వెండి తెరపై అద్భుతమైన దృశ్యకావ్యాలకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. తాజాగా 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగీలా సినిమాను రీరిలీజు సందర్భంగా ఎన్జీటీకి ఆర్జీవీ స్పేషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు.. రంగీలా సినిమా విశేషాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: 12A Railway Colony Review: ’12ఏ రైల్వే కాలనీ’ రివ్యూ

ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. తనహా తనహా ఎహేపే జీనా సాంగ్ ష్యూటింగ్ సందర్భంగా హోల్ యూనిట్ ఆసక్తిగా ఉందన్నారు. ఈ సాంగ్‌ను బీచ్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేశామన్నారు. ఆ సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకొచ్చిన డ్రెస్ నచ్చకపోవడంతో హీరోయిన్ ఉర్మిళ కోసం జాకీ ష్రాఫ్ తన టీషర్ట్ తీసుకొని వచ్చాడని అన్నారు. అప్పుడు ఉర్మిళ ఆ టీషర్ట్ వేసుకొని బీచ్‌లో పరిగెత్తినట్లు తెలిపారు. ఈ పాట షూటింగ్ అనేది తన మోస్ట్ ఫేవరేట్ షాట్స్‌లో ఒకటిగా ఆర్జీవీ వెల్లడించారు. ఈ సినిమాను చాలా ఎగ్జైట్‌మెంట్‌తో తీసినట్లు ఆయన తెలిపారు. రంగీలా సినిమాలోని మూడు ప్రధాన పాత్రలకు ఆమీర్‌ఖాన్, ఉర్మిళ, జాకీ ష్రాఫ్ తన ఫస్ట్ ఛాయిస్‌ అని ఆర్జీవీ వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమా విషయంలో తను చాలా సంతృప్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

READ ALSO: Tejas Crash Dubai: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం.. భారత్ పైలట్ మృతి

Exit mobile version