NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి ట్రైలర్ పై ఆర్జీవి పజిల్.. కనిపెడితే లక్ష ఇస్తానంటూ బంపర్ ఆఫర్..?

Kalki

Kalki

Kalki 2898 AD : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD “సినిమాకోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్ ,దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.భారీ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Read Also :The Greatest of All Time : విజయ్ బర్త్ డే.. స్పెషల్ వీడియో అదిరిపోయిందిగా..

ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ముంబై లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జూన్ 21 న సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.ఈ ట్రైలర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.అదిరిపోయే విజువల్స్ ఎంతో గ్రాండ్ గా అనిపించాయి.అలాగే యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో వున్నాయి.అయితే తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ చూసిన ఆర్జీవి ఫిదా అయిపోయి చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.అలాగే కల్కి ట్రైలర్ ను ట్విట్టర్ లో షేర్ చేసి ఒక పజిల్ కూడా ఇచ్చాడు.ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కొన్ని వర్డ్స్ ఇచ్చి అందులో కొన్ని లెటర్స్ ను మిస్ చేసారు .ఈ పజిల్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి లక్ష ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.ప్రస్తుతం ఆర్జివి ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.