NTV Telugu Site icon

HanuMan : హనుమాన్ టీం ను ప్రశంసించిన ఆర్జివీ.. వైరల్ అవుతున్న ట్వీట్..

Whatsapp Image 2024 01 12 At 4.01.56 Pm

Whatsapp Image 2024 01 12 At 4.01.56 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో (జనవరి 12) న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంటుంది.హనుమాన్ చిత్రం అంచనాలకు మించి ఉందంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ సినిమా బ్లాక్‍బాస్టర్ పక్కా అనే చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

గురువారమే ప్రీమియర్స్ మొదలుకాగా.. ఆరంభం నుంచే ఈ మూవీకి సూపర్ టాక్ వచ్చింది. అద్భుతమైన విజువల్స్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేసాడు అంటూ ప్రేక్షకులు దర్శకుడిని తెగ పొగిడేస్తున్నారు.దీంతో హనుమాన్ మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఈ మూవీ గురించి సంచలన దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు హీరో తేజ సజ్జాకు అభినందనలు తెలుపుతూ రామ్‍ గోపాల్ వర్మ నేడు ట్వీట్ చేశారు. “అందరి నుంచి బ్లాక్‍ బాస్టర్ తెచ్చుకుంటున్న సందర్భం లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కు కంగ్రాచులేషన్స్. జై హను-మాన్” అని ఆర్జీవీ రాసుకొచ్చారు. అయితే చాలా అరుదుగా వేరే చిత్రాల గురించి ఆర్జీవీ ట్వీట్ చేస్తుంటారు. అందులోనూ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన హను-మాన్ గురించి ఆయన స్పందించడం ఎంతో ఆసక్తికరంగా మారింది. గతంలో రామాయణం విషయంపై ఆయన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అయితే, తాను హను మాన్ చిత్రం ను చూశారా లేదా అన్నది మాత్రం ఆయన ట్వీట్‍ చేయలేదు.

Show comments