RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం శివ. అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌తో పాటు, తెలుగు సినిమా దిశను మార్చిన చిత్రంగా టాలీవుడ్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల కాలంలోనే ఈ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సూపర్ స్టిల్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆయన డైరెక్షన్లో వస్తున్న సినిమా ఏంటి అందులో నటిస్తున్న నటీనటులు ఎవరు అనేది ఈ స్టోరీ తెలుసుకుందాం.
READ ALSO: Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు.. విలువ ఎంతో తెలుసా!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ఆర్జీవీ తన కొత్త సినిమా “పోలీస్ స్టేషన్ మే భూత్”ను హారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా నుంచి ఒక ప్రమోషనల్ స్టిల్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ఫోటోలో రావు రమేష్, మనోజ్ బాజ్పేయ్లు పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తూ, ఆఫీస్‌లో రిలాక్స్డ్ మూడ్‌లో ఏదో అంశం గురించి చర్చిస్తున్నట్లు కనిపించారు. టెన్షన్‌తో పాటు హ్యూమర్ కూడా మిక్స్ అయిన ఈ సినిమా లుక్ చాలా బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ సుమారుగా ఐదేళ్ల తర్వాత హారర్ జోనర్లోకి తిరిగి వస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం “పోలీస్ స్టేషన్ మే భూత్”. ఈ సినిమాలో ఆర్జీవీతో సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ మనోజ్ బాజ్పేయ్తో జోడీ కడుతున్నాడు. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్, రమ్యాకృష్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రమ్యాకృష్ణ లుక్‌తో అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేశారు ఆర్జీవీ. వాస్తవానికి ఈ సినిమా పోలీస్ స్టేషన్లో భూతం తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు సినీ సర్కిల్ టాక్ నడుస్తుంది. ఆర్జీవీ దర్శకత్వంలో చాలా సంవత్సరాల తర్వాత హారర్ జోనర్లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Here’s #RaoRamesh and @BajpayeeManoj in a scene from POLICE STATION MEIN BHOOT pic.twitter.com/01wG7AJf7O
— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2025
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!