Site icon NTV Telugu

RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..

Rgv New Movie

Rgv New Movie

RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం శివ. అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌తో పాటు, తెలుగు సినిమా దిశను మార్చిన చిత్రంగా టాలీవుడ్‌లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల కాలంలోనే ఈ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సూపర్ స్టిల్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆయన డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ఏంటి అందులో నటిస్తున్న నటీనటులు ఎవరు అనేది ఈ స్టోరీ తెలుసుకుందాం.

READ ALSO: Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు.. విలువ ఎంతో తెలుసా!

ఆర్జీవీ తన కొత్త సినిమా “పోలీస్ స్టేషన్ మే భూత్”ను హారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా నుంచి ఒక ప్రమోషనల్ స్టిల్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ఫోటోలో రావు రమేష్, మనోజ్ బాజ్‌పేయ్‌లు పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తూ, ఆఫీస్‌లో రిలాక్స్‌డ్ మూడ్‌లో ఏదో అంశం గురించి చర్చిస్తున్నట్లు కనిపించారు. టెన్షన్‌తో పాటు హ్యూమర్ కూడా మిక్స్ అయిన ఈ సినిమా లుక్ చాలా బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ సుమారుగా ఐదేళ్ల తర్వాత హారర్ జోనర్‌లోకి తిరిగి వస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం “పోలీస్ స్టేషన్ మే భూత్”. ఈ సినిమాలో ఆర్జీవీతో సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ మనోజ్ బాజ్‌పేయ్‌తో జోడీ కడుతున్నాడు. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్, రమ్యాకృష్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రమ్యాకృష్ణ లుక్‌తో అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేశారు ఆర్జీవీ. వాస్తవానికి ఈ సినిమా పోలీస్ స్టేషన్‌లో భూతం తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు సినీ సర్కిల్ టాక్ నడుస్తుంది. ఆర్జీవీ దర్శకత్వంలో చాలా సంవత్సరాల తర్వాత హారర్ జోనర్‌లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO: Bollywood vs Malayalam Industry: స్టార్ అనిపించుకోకపోతే ఈ ఇండస్ట్రీ వాళ్లు పట్టించుకోరు: దుల్కర్ సల్మాన్

Exit mobile version