RGI Airport : ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్ ఎంట్రీ నంబర్ 9 సమీపంలో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మెరుగైన సామధ్యం తో అంతరాయం లేని ప్రయాణాన్ని పెంచడానికి, విమానాశ్రయం ఎనిమిది పూర్తి ఆటోమేటెడ్ సెల్ఫ్-బ్యాగేజ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాల్లో స్కానర్లు, స్కేల్స్, సెన్సర్లు అమర్చి ప్రయాణికులు తమ బ్యాగేజీ చెక్ ఇన్ సదుపాయాన్ని 45-60 క్షణాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త సర్వీస్ గురించి జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ శ్రీ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకుల కోసం కొత్త సెల్ఫ్ బ్యాగేజ్ సదుపాయం యొక్క మరొక సౌలభ్యాన్ని జోడించడం మాకు సంతోషంగా ఉంది. సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ మరియు చెక్ ఇన్ ప్రాసెస్ యొక్క టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ప్రయాణాన్ని వేగవంతం మరియు సులభతరం చేయటమే కాకుండా ప్రయాణీకుల అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెడుతూనే, మా ప్రయాణీకులందరికీ ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.”
సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ఉపయోగించడానికి శీఘ్ర గైడ్:
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
స్టెప్ 1: సెల్ఫ్ చెక్ ఇన్
బోర్డింగ్ పాస్ ప్రింట్ చేయడానికి ప్రయాణికులు కియోస్క్ లో సెల్ఫ్ చెక్ చేసుకుంటారు. కియోస్క్ వద్ద వారు బ్యాగేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని, బ్యాగుల సంఖ్య, బరువు వంటి వివరాలను అందించి, బ్యాగ్ ట్యాగ్‌ను ప్రింట్ తీసుకుంటారు.
స్టెప్ 2: సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్
బ్యాగేజీ ట్యాగింగ్ తర్వాత, ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ యూనిట్‌కు వెళ్తారు. వారు బ్యాగేజీని కన్వేయర్ బెల్ట్ పై ఉంచుతారు మరియు బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి వారి బోర్డింగ్ పాస్ లోని బార్ కోడ్ ను స్కాన్ చేస్తారు. సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ బ్యాగ్‌పై తనిఖీలు చేసి అంతా సక్రమంగా ఉంటే, బ్యాగ్‌ను ప్రాసెస్ చేసి విమానయాన సంస్థకు ఆమోదాన్ని పంపుతుంది. ఒకవేళ బ్యాగేజ్ అవసరమైన ప్రమాణాలను అందుకోనట్లయితే, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ దానిని తిరస్కరించి చెక్-ఇన్ ఏజెంట్ నుండి సహాయం పొందమని ప్రయాణికుడికి తెలియజేస్తుంది. ఒకవేళ అదనపు బ్యాగేజీ ఉంటే ప్రయాణికుడు విమానయాన సంస్థకు చెందిన బ్యాగేజ్ కౌంటర్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. తొలుత బెంగళూరు, చెన్నై వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..