Site icon NTV Telugu

Nitin Gadkari: కేంద్రం గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లే ‘రహ్-వీర్’లకు రూ.25,000 బహుమతి

Nithin Gadkari

Nithin Gadkari

నిర్లక్ష్యం, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు పలువురు వాహనదారులు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. చాలా మంది తీవ్ర గాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తన, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో, ఎంపీలు అందరు తమ తమ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రోడ్డు భద్రతా ప్రచారాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:SS Thaman: అఖండ తాండవం కోసం టెక్నాలజీని నమ్మలేదు.. శివాలజీని నమ్మం

యుద్ధం, అంటువ్యాధి కంటే ఎక్కువ మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాల భయానకంపై గడ్కరీ విచారం వ్యక్తం చేస్తూ, దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటిలో 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఏదైనా యుద్ధం లేదా కోవిడ్ మహమ్మారి వల్ల సంభవించే మరణాల కంటే ఎక్కువ అని వెల్లడించారు. ఈ ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది యువకులేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గణాంకాల ప్రకారం, మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 18-34 సంవత్సరాల వయస్సు గల వారు 66 శాతం మంది ఉన్నారని అన్నారు.

Also Read:PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..

2025లో ప్రారంభించిన ‘రహ్-వీర్’ పథకం కింద, ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించే వారికి ‘రహ్-వీర్’ అనే బిరుదు, రూ.25,000ల నగదు బహుమతిని అందజేస్తామని మంత్రి తెలిపారు. ‘రహ్-వీర్’ పథకం కింద, రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ఎవరినైనా ‘రహ్-వీర్’ అని పిలుస్తారు. ప్రభుత్వం ఆ వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులకు 7 రోజుల వరకు చికిత్స కోసం ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు ఆసుపత్రులకు తిరిగి చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి 7,000 ‘బ్లాక్‌స్పాట్‌లు’ (తరచుగా ప్రమాదాలు జరిగేవి) ప్రభుత్వం గుర్తించింది. వాటిని పరిష్కరించడానికి రూ.40,000 కోట్లు కేటాయించిందని గడ్కరీ తెలిపారు.

Exit mobile version