మార్కెట్ లోకి ఎన్నో రకాల బైకులు వస్తుంటాయి.. అందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకొస్తున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త బైకు వచ్చేసింది.. రివోల్ట్ మోటార్స్ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఆ బైక్ ధర, ఫీచర్లు,ఏంటో వివరంగా తెలుసుకుందాం..
అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. గత రెండేళ్లుగా ఈవీలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ ధరలో మంచి పనితీరుతో పాటు ఇంధన బాధలు తప్పించడమే ఇందుకు కారణం. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవని చెప్పాలి.. అందుకే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను తయారు చేస్తున్నాయి..
ఈ క్రమంలో ఈ కొరత తీర్చేందుకు హర్యానాకు చెందిన ఆటో కంపెనీ రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. RV400 బైక్ యొక్క కొత్త వేరియంట్ RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది.. ఈ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాటరీ విషయానికొస్తే కొత్త రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్‌లో 72V 3.24 kWh లిథియం – అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ కేవలం 3 గంటల్లో 75 శాతం ఛార్జ్ అవుతుందని .. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.. ఇక రివోల్ట్ మోటార్స్ కొత్త RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తోంది. అవి ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్‌లు. పూర్తి ఛార్జ్ చేసినప్పుడు ఈ మోడ్‌లలో వరుసగా బైక్ 150 కి.మీ, 100 కి.మీ మరియు 80 కి.మీ రేంజ్‌ను అందిస్తున్నాయి..
ఈ రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ టూ వీలర్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా అనేక ఫీచర్స్ ను కలిగి ఉంది.. ఈ కొత్త బైక్ లూనార్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, డార్క్ సిల్వర్, రెబెల్ రెడ్ కలర్ లలో లభిస్తుంది.. ఇక అదిరిపోయే ఫీచర్స్ ను కలిగిన ఈ బైకు ధర విషయానికొస్తే.. . 1.34 లక్షలు అని కంపెనీ ప్రకటించింది…