Site icon NTV Telugu

Nagari: నగరిలో కొత్త పంచాయతీ..! మంత్రి రోజాకు రివర్స్ షాక్..!

Roja

Roja

Nagari: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు నేతలు.. అయితే, వ్యతిరేక వర్గాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ఒకరని సస్పెండ్‌ చేయించిన రోజాకు.. ఇప్పుడు ఊహించని రీతిలో రివర్స్‌ షాక్‌ తగులుతోంది.

Read Also: Actor Naresh : రానున్న రోజుల్లో జాగ్రత్త.. వైరల్ అవుతున్న నటుడి ట్వీట్

ఫైర్‌ బ్రాండ్‌ మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచి సమస్యలు ఉన్నాయి. రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమెకు స్థానిక నేతలతో విభేదాలు తలనొప్పిగా మారాయి. నగరి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయని నేతలు చెబుతున్నమాట.. గతంలో రోజాను గెలిపించనవారే.. ఆమె తీరు నచ్చకపోవడంతో.. తిరుగుబాటు చేశారు.. ఇక, ఈ రచ్చకు పులిస్టాప్‌ పెట్టేందుకు వడమాలపేట జెడ్పీటీసీ మురళీరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. మురళీ గత కొంత కాలంగా మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు.. ఆమెకు టికెట్‌ కేటాయించొద్దని వైసీపీ అధిష్టానాన్ని సైతం కోరారు. అలాగే ప్రొటోకాల్‌ విషయంలోనూ విభేదాలు నడిచాయి.. మరోవైపు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ముద్రపడిన మురళీరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడడంతో.. జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రోజా వద్దు.. పార్టీ ముద్దు అంటూ.. ప్రెస్‌ మీట్‌ పెట్టారు మురళీరెడ్డి.. అయితే, అతడిపై వేటు వేస్తే.. అంతా దారిలోకి వస్తారని పార్టీ భావించింది.. కానీ, దానికి భిన్నంగా మంత్రి రోజాకు షాక్‌ ఇచ్చింది వ్యతిరేకవర్గం.. ఆ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు రోజాకు సపోర్ట్‌గా ఉన్న నేతలు షాక్‌ ఇవ్వడంతో.. ఎన్నికల్లో ఏం జరుగుతుందో నన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి ఆర్కే రోజా.. ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version