NTV Telugu Site icon

Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Sisodiya

Sisodiya

రెవెన్యూ శాఖపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని సిసోడియా తెలిపారు. భూ రికార్డులను భద్రపరిచాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను జాగ్రత్త చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేర్కొన్నారు. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు.. పాలన ఇలా చేస్తారా..? అని ప్రశ్నించారు. 56 ఏళ్లున్న వీఆర్ఏను కాపలాగా పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు నడుపుతామా..?అని అన్నారు. క్షేత్ర స్థాయిలోని పిటిషన్లు సీఎం వద్దకు వస్తే.. కలెక్టర్లు విఫలమైనట్టేనని తెలిపారు. రికార్డులను భద్రపర్చే విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సిసోడియా కలెక్టర్లకు తెలిపారు.

Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు రెవెన్యూ శాఖవే ఉంటున్నాయని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా తెలిపారు. గతంలో సరిహద్దు తగాదాలు గురించి.. సాంకేతిక సమస్యల గురించి ఫిర్యాదులు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు మా భూములను లాగేసుకున్నారనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గత ఐదేళ్లల్లో భూ సంబంధిత సమస్యలు చాలా పెరిగాయి.. ఎక్కడో ఏదో తప్పు జరిగిందన్నారు. భూములు డాక్యుమెంట్లు తమ వద్దే ఉన్నా.. భూములు వివాదంలో ఉన్నాయని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని సిసోడియా తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు భూ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండే కలెక్టర్ల మీద విశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..

కలెక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.. కలవడం లేదనే ఫిర్యాదులూ చాలా ఉన్నాయని సిసోడియా పేర్కొన్నార. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు.. వీటిల్లో 25,235 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయన్నారు. సేల్, గిఫ్ట్, తనఖా పేర్లతో అనుమానస్పదన రిజిస్ట్రేషన్లు చేసేశారని అన్నారు. అనుమానస్పదంగా ఉన్న రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని తెలిపారు. అనర్హులకు అసైన్డ్ భూములు కట్టబెట్టారని.. తక్కువ ధరకు కొందరికి భూములు కట్టబెట్టారని సిసోడియా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ తెలిపారు.