Regina : నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన రివేంజ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా..ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రెజీనా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తెలుగు ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. జూన్ 23న పలు తెలుగు సినిమాలు రిలీజ్ కావడంతో రెజీనాకు అనుకున్న స్థాయిలో థియేటర్స్ లభించలేదు.దాంతో రెజినా తెలుగు రిలీజ్ డేట్ వాయిదాపడింది. తమిళంలో సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత తెలుగులో రెజీనాను రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా సాహసించలేదు..దాంతో రెజీనా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజైంది.
తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రెజీనా మూవీకి మలయాళ ఫిల్మ్ మేకర్ డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెజీనా మూవీలో అనంత్ నాగ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇందులో కంప్లీట్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో సునైన నటించింది.హీరోయిన్ సునైన ఈ మూవీలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించింది. తన భర్త మరణంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో దర్శకుడు రొమిన్ డిసిల్వా రెజీనా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో సునైన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రెజీనా తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Tags
- ott streaming
- Regina
- Sunaina
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!