Revenge Murder: యూపీలోని భదోహిలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 27 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రిన్సిపాల్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సూత్రధారి సౌరభ్‌సింగ్‌తో పాటు ఇతర కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యాకాండకు పాల్పడిన వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ 27 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పటికి సౌరభ్‌కి ఏడాది కూడా నిండలేదు. అయితే, పెద్దయ్యాక తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. అక్టోబరు 21న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్‌ను పట్టపగలు కిరాయి గుండాలచే హతమార్చాడు.
Also Read: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
27 సంవత్సరాల క్రితం సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ నేషనల్ ఇంటర్ కాలేజ్‌లో నియమితుడయ్యాడు. అయితే, ఆ సమయంలో అతను హత్యకు గురయ్యాడడు. ఈ హత్య తర్వాత యోగేంద్ర బహదూర్ సింగ్ చేరాడు. ఇకపోతే, సౌరభ్ తండ్రి హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అయితే, వారిద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇక్కడ సౌరభ్ మనసులో ప్రతీకార భావం పెరుగుతూనే ఉంది. అజయ్ బహదూర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో యోగేంద్ర బహదూర్ కూడా ఉన్నాడు.
ఈ కేసులో అజయ్ బహదూర్ సింగ్ హత్యకు గురైన సమయంలో అతని కుమారుడు సౌరభ్ సింగ్ వయస్సు 6 నెలలని భదోహి పోలీసులు తెలిపారు. తన తండ్రి హత్య చేయకుంటే యోగేంద్ర బహదూర్ ప్రిన్సిపాల్ అయ్యేవాడు కాదని సౌరభ్ నమ్మబలికాడు. దింతో అతను ప్రిన్సిపాల్ తో శత్రుత్వం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్యకు సౌరభ్ సింగ్ రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. షూటర్లు ఒక నెలపాటు ప్రిన్సిపాల్‌ను రెక్కీ నిర్వహించారు. అయితే, అక్టోబర్ 21న ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుండగా ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ కారులో కాల్చి చంపబడ్డాడు. పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టగా.. 27 ఏళ్ల పగ కారణంగా తండ్రిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హత్య చేసినట్లు తెలుసుకున్నారు.