Site icon NTV Telugu

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ !

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే… కచ్చితంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుకే.. సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే… ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి… ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్‌ నేతలకే అమ్మే కుట్ర జరుగుతుందని నిప్పులు చెరిగారు రేవంత్‌ రెడ్డి. ”విలువైన ఆర్టీసీ ఆస్తులను సొంత పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుంది.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మూతబెట్టి నష్టాల పేరుతో గరీబోడి జేబుకు చిల్లు పెడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.” అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి.

Exit mobile version