Site icon NTV Telugu

Revanth Posters In AP: రేవంత్ రెడ్డికి ప్రమాణ స్వీకారం.. నందిగామలో వెలసిన పోస్టర్లు

Revanth

Revanth

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వెలసిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలతో బ్యానర్లు వెలశాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసిన బ్యానర్లను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబుకి ప్రియమైన శిష్యుడు రేవంత్ రెడ్డి అని అతని రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలు కావడంతో వరేపు ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు తెలిపి.. చంద్రబాబు విజయంలో రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తాడని అఖిల భారత నందమూరి తారక రామరావు అభిమాన సంఘ నాయకుడు వడ్డెల్లి సాంబశివరావు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు అవ్వాలని పిలుపు వచ్చిందని ఆయన తెలిపాడు.

Read Also: CM Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌ హాజరవుతారా?

మరోవైపు, కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలంగాణలోని టీడీపీ సపోర్టర్స్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు దక్కించుకోవడంతో టీడీపీ నేతలు సైతం తెగ సంబరాలు చేసుకున్నారు.

Exit mobile version