NTV Telugu Site icon

Revanth Reddy: 35 ఏళ్ల విద్యార్థి, రాజకీయ జీవితంలో వీళ్లతోనే కలిసి పని చేశా..

Revanth Reddy

Revanth Reddy

నా 35 సంవత్సరాల విద్యార్థి, రాజకీయ జీవితంలో వివిధ దశల్లో కలిసి పనిచేసిన వారు ఈ వేదిక మీద ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “విద్యాసాగర్ రావును అందరూ సాగర్ జీ గానే గుర్తిస్తారు. మాకు కూడా ఆయన సాగర్ జీ నే. వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి విద్యాసాగర్ రావు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు. ఈ రోజు యూనివర్సిటీలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీల్లో బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని ఆదేశించాను. మళ్ళీ వర్సిటీలకి పూర్వ వైభవం తేవాలి అని చెప్పాను. విద్యార్థుల పోరాటం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకం అయింది. పార్టీ ఫిరాయింపుల మీద నేను మాట్లాడితే బాగుండదేమో.. కానీ ఈ రోజు ప్రజా జీవితంలో ఉండే వారు యే పార్టీలో ఉన్నామని కాకుండా పదవుల్లో ఉండాలని అనుకుంటున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి రాకపోవడమే కారణం.. విద్యార్థి రాజకీయాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..” అని సీఎం వ్యాఖ్యానించారు.

READ MORE:Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..

ప్రతి పక్షం, పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. “సభలో పాలక పక్ష నేతకు ఎంత ప్రాధాన్యం ఉండేదో ప్రతి పక్ష నేతకు అంతే ప్రాధాన్యం ఉండేది… కాల క్రమేణా ఆ స్ఫూర్తిని కోల్పోయాం.. సభలో ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష సభ్యున్ని మేము సస్పెండ్ చేయలేదు. గోదావరి పై నిర్మించిన ప్రాజెక్ట్ ల గురించి అందరికీ తెలుసు. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి అవసరం. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. వారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే నా ధ్యాస ఉంటుంది. దేశ అభివృద్ధికి తెలంగాణ నుంచి వన్ ట్రిలియన్ ఎకానమీ అందిస్తానని మోడీకి చెప్పా. అందుకోసం కేంద్ర సహకారం కావాలని కోరా. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, హైద్రాబాద్ మెట్రో పొడిగించాలని కోరా. డ్రై పోర్ట్ అనుమతి కావాలని విజ్ఞప్తి చేశా. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సహకరించాలని విన్నవించా. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ మంజూరు చేశారు.. పనులు వేగవంతం చేయాలి. ప్రపంచంతో పోటీ పడాలని అంటే బండి సంజయ్ మెట్రో రైల్ పొడిగింపు విస్తరణ కోసం అనుమతి తేవాలి.. తమిళనాడులో అన్ని పార్టీలు ఒక్కటై పని చేస్తాయి.. జల్లి కట్టుపై అన్ని పార్టీలు ఒకట అయ్యాయి.. స్టేట్ ఇష్యూలపై అన్ని పార్టీలు ఇక్కడ కూడా కలిసి పని చేద్దాం.” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

 

Show comments