Revanth Reddy: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని విమర్శించారు. ఐటీ దాడుల నుంచి బయటపడేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. గత వారం కేటీఆర్ సొంత కంపెనీపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ సొంత ఆస్తులను మేనేజ్ చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను బయటపెట్టడానికే కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఢిల్లీలో ఎన్ని రౌండ్లు వేసినా రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
Read also: KCR Maharashtra Tour: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండు రోజుల పర్యటన వివరాలు
కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వంద కోట్ల రూపాయలు తీసుకున్న మంత్రులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారని అన్నారు. రూ. 100 కోట్లు దోచుకున్న కేసీఆర్, ఆయన మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మలం బంధమని విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కోరారు. భ్రమలు పెట్టుకోవద్దని సూచించారు. ఢిల్లీ పెద్దలకు కేసీఆర్, బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ఢిల్లీ వదిలి గల్లీకి వచ్చి పోరాడాలని కోరారు.
GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
