NTV Telugu Site icon

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కౌంటర్..

Revanthreddy

Revanthreddy

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే, ఈ పోస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇయ్యు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు, నిన్న ( బుధవారం ) మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే, నీలాంటి వాడిని చూసే.. “నిజం చెప్పులు తొడుక్కునే లోపు.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టింది అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డ్రామాలు ఆపి.. నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది అని ఆయన పేర్కొన్నారు.