NTV Telugu Site icon

Revanth Reddy: ముఖ్యమంత్రి ఆదేశాలతో గిరిజన అమ్మాయికి ఐఐటీకి వెళ్లేలా ప్రభుత్వం సాయం..

Revanth Reddy Helps Poor Girl

Revanth Reddy Helps Poor Girl

Revanth Reddy Helps Poor Girl who got seat in IIT: ఐఐటి జేఈఈలో ప్రతిభ కనపరిచి మంచి ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువులతల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

High Court: ఆ అధికారులపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం

సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ గారి ద్వారా విద్యార్థిని మధులతకు రూ. 1,51,831 ల చెక్కును అందజేశారు. విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70 వేలకు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌ ఘటనలో విచారణ ముమ్మరం.. రేపటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ

ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతోన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థిని సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమములో ట్రీకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజనశాఖ అధికారులు మొదలగు వారు పాల్గొన్నారు.