Site icon NTV Telugu

Revanth Reddy : అమ్ముడు పోయిన సన్నాసులకు గుణపాఠం చెప్పాలి

Revanth Reddy Congress

Revanth Reddy Congress

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మద్దతుగా చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పీపుల్ పహాడ్ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్ముడు పోయిన సన్నాసులకు గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ లో కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావు ఒక్కొక్కరు ఒక్కో ఊరు పంచుకుంటున్నారని, బీజేపీ వైపు ఢిల్లీ నుంచి పెద్ద పెద్దోళ్ళు దిగిండ్రు.. ఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా? ఢిల్లీ వాడు వచ్చినా.. గజ్వేల్ తాగుబోతులు వచ్చినా మునుగోడు ప్రజల ముందు బలాదూరే అని ఆయన అన్నారు.

 

కాంగ్రెస్ ను చంపాలని రాజగోపాల్ రెడ్డి అంటుండని, నిన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినందుకా? అని ఆయన ప్రశ్నించారు. నీకు ప్రజల్లో విలువను పెంచినందుకా కాంగ్రెస్ ను చంపాలనుకుంటున్నావ్‌.. రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎవరు ఏమిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేసి గెలిపించండని ఆయన అన్నారు.

Exit mobile version