Site icon NTV Telugu

CM Revanth Reddy: దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ డిమాండ్..

Revanth Reddy

Revanth Reddy

జగదీప్‌ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు. ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న వెంకయ్య నాయుడును వెనక్కి పంపించారన్నారు. ఎన్డీయే తెలంగాణలో ఉన్న బీసీలకు అన్యాయం చేసిందని.. ఎన్డీఏ దత్తాత్రేయ, బండి సంజయ్ ల గొంతు కోసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబెట్టాలన్నారు. 2029 లో పార్లమెంట్ ఎన్నికలకు ఓబీసీ ఇరిర్వేషన్లు లిట్మస్ టెస్ట్ అవుతాయి. ఓబీసీలకు న్యాయం చెయ్యడానికి బీజేపీ సర్కార్ సిద్ధంగా లేదు. ఏ బిల్లు పంపినా క్లారిఫికేషన్ అడుగుతారు.. రిజర్వేషన్ల బిల్ పై క్లారిటీ అడిగారు. వాళ్ళు అడిగిన దానికి క్లారిటీ ఇచ్చామని సీఎం తెలిపారు.

READ MORE: HHVM : హరిహర వీరమల్లుకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Exit mobile version