NTV Telugu Site icon

Revanth Reddy: రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు భారీ యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 6 కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే గట్టిగా ఢీకొనడంతో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లైంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Venkaiah Naidu: యువతకు వెంకయ్యనాయుడు సందేశం.. రాజకీయాల్లోకి రావాలంటూ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే, రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో 6 కార్లకు యాక్సిడెంట్ అయింది. 6 కార్లలో 4 కార్లు రేవంత్ కాన్వాయ్‌కు సంబంధించినవి కాగా.. మరో రెండు కార్లు రిపోర్టర్లకు చెందినవని తెలిసింది. కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

రేవంత్ కాన్వాయ్‌కు గతంలో కూడా ఇలానే ప్రమాదం జరిగింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.‘మన ఊరు .. మన-పోరు’ బహిరంగ సభను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గతేడాది మార్చిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వెళ్తుండగానే రేవంత్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లారు.

Show comments