Site icon NTV Telugu

CM Revanth Reddy : మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది..

Revanth Reddy

Revanth Reddy

కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారని, 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామన్నారు రేవంత్‌ రెడ్డి. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని, నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’40కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ… ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు.. కర్ణాటక నుంచి 26ఎంపీలను ఇస్తే… మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి.. మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప.. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు.. నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారు… అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉంది.. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి.. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండి… ఇక్కడ కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే… ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి.. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ను గెలిపించండి… లక్ష మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించండి…’ అని రేవంత్‌ రెడ్డి కోరారు.

Exit mobile version