CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
- డిసెంబర్ లో చిలుకపచ్చ చీరలు పంపిణీ చేస్తామన్న సీఎం..
- మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు, నాణ్యతపై ప్రజల్లో భిన్నభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.
పుట్టింటి సారెలాంటి కానుక..
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ఇచ్చే చీరలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదని.. అవి పుట్టింటి వారు ప్రేమతో పెట్టే ‘సారె’ అంత పవిత్రమైనవని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అంతకంటే ఆకర్షణీయమైన, మహిళలకు ఎంతో ఇష్టమైన ‘చిలుక పచ్చ’ రంగు చీరలను అందించబోతున్నామని స్పష్టం చేశారు.
డిసెంబర్‌లో పంపిణీ..
ఈ ప్రత్యేకమైన చిలుక పచ్చ రంగు చీరలను వచ్చే డిసెంబర్ నెలలో పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పండగలు, శుభకార్యాల సమయంలో ఆడబిడ్డలు గర్వంగా ధరించేలా నాణ్యమైన చీరలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవాన్ని పెంచేలా, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు.
Also Read:New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సంక్షేమమే లక్ష్యం..
ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని.. ఇప్పుడు నాణ్యమైన చీరల పంపిణీ ద్వారా ఆడబిడ్డల పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నామని చెప్పారు. మహిళా శక్తిని గౌరవించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!