Site icon NTV Telugu

Revanth Reddy : కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారు

Revanth Reddy Congres

Revanth Reddy Congres

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించి ప్రజల పక్షాన అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ 43 లక్షల డిజిటల్ మెంబర్‌షిప్‌ చేసి పార్టీ పటిష్ఠతన చాటుకుందని ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు 2 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేయగలిగామన.. ఇది కార్యకర్తలకు ఎంతో భరోసా ఇచ్చింది. రైతు డిక్లరేషన్ సభ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్ సభలో పాల్గొని పార్టీకి దిశా నిర్దేశం చేశారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 15 రోజుల పాటు పెద్దఎత్తున విజయవంతం అయ్యిందన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారని, అందరికి పేరు పేరున హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఎన్నికల సంవత్సరం ఈ ఏడాది కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉంది. మనమంతా కలిసి కష్టపడి పని చేస్తే తెలంగాణ లో సోనియమ్మ రాజ్యం తెస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కు తెలంగాణ లో పార్టీని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇద్దామని ఆయన అన్నారు.

Exit mobile version