హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కామారెడ్డిలో కొనసాగుతుంది. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని, పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయన్నారు.
Also Read : Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్
ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలని, రేపు గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు దీక్షకు అందరూ తరలిరండని ఆయన పిలుపునిచ్చారు. 2004లో గెలిపించినట్టే.. 2024లో 50వేలకు పైగా మెజారిటీతో షబ్బీర్ అలీని గెలిపించండని ఆయన కోరారు. ఆయన ఒక్క సంతకంతో ఎన్ని నిధులంటే అన్ని నిధులు ఇచ్చే కుర్చీలో కూర్చునేలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని, 20,21,22 ప్యాకేజి పనులు పూర్తి చేసి ఉమ్మడి నిజామాబాద్ లో 3లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : WPL20223 : హర్మన్ ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్