Site icon NTV Telugu

Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌..

Bismah Maroof

Bismah Maroof

తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్‌ మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మా మ‌రూఫ్‌ రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని మ‌రూఫ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా గురువారం వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ లో ఆమె “నేను చాలా ఇష్టపడే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించునున్నని.. ఇక ఇందులో నా 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు, అలాగే అనేక మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందిని తెలుపుతూ.. తన క్రికెట్ ప్రయాణంలో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ముఖ్యంగా జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తనపై నమ్మకం ఉంచి, ఈ స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతను తెలిపింది.

Also Read: Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?

ఇక చివరగా పాకిస్థాన్ కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పినట్లు ‘ పీసీబీ ‘ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే 2006లో అంతర్జాతీయ క్రికెట్‌ లో అరంగేట్రం చేసిన మ‌రూఫ్ తన 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌ కు త‌న సేవ‌లు అందించడంలో ఎప్పుడు ముందుండేది. బిస్మా మ‌రూఫ్‌ పాకిస్తాన్ జ‌ట్టు త‌ర‌పున వ‌న్డేలు, టీ20 లలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డులు ఇప్ప‌టికి ఆమె పేరునే ఉన్నాయి.

Also Read: Bank charges: కస్టమర్లకు బ్యాంకులు షాక్.. మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!

ఇక బిస్మా మ‌రూఫ్‌ పాకిస్థాన్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు.. 44 వికెట్లు పడగొట్టింది. అలాగే 146 టీ20 లలో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది. ఇక మోతంగా తన కెరియర్ లో 96 మ్యాచ్‌ లలో పాక్‌ జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరించింది.

Exit mobile version