టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు నాకు వేరే పని ఏమీ లేదు, ఖాళీ దొరికినప్పుడల్లా మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటమే నా పని’ అంటూ నవ్వులు పూయించారు.
Also Read : OTT Piracy : ఓటీటీల చేతకానితనమే పైరసీకి వరమా?
సెహ్వాగ్ మాటల్లో మన టాలీవుడ్ స్టార్ల పట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్ధం అంతుంది.. అంతే కాదు ‘నాకు టాలీవుడ్‌లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాను ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు చూశాను’ అని .. మన దగ్గర భాష అర్థం కాకపోయినా, హిందీ డబ్బింగ్‌లో అయినా సరే ఈ సినిమాలను అస్సలు వదలనని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమాలోని “సాలా ఝుకేగా నహీ” (తగ్గేదేలే) డైలాగ్ తనకెంతో ఇష్టమని, ఆ మేనరిజం తనకింకా గుర్తుందని గుర్తు చేసుకున్నారు.ఈ ఈవెంట్‌లో సెహ్వాగ్‌తో పాటు కపిల్ దేవ్, సురేష్ రైనా కూడా పాల్గొనగా, నిర్మాత దిల్ రాజు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
