Site icon NTV Telugu

Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

Chain Snaching

Chain Snaching

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన ఆర్మీ అధికారి చైన్ స్నాచర్ గా మారాడు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 7.5లక్షల విలువైన 5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారత ఆర్మీలో 30ఏళ్లు సేవలందించిన నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

Also Read:Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడు షేర్ మార్కెట్, ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టి భారీగా నష్టపోయినట్లు తెలిపారు. తన దురవాట్లు, కుటుంబ అవసరాలు తీర్చడం కోసం చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాకతీయ ఎక్స్ ప్రెస్ లో ఈ నెల 2న, 3న వరుసగా మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని నిందితుడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version