NTV Telugu Site icon

Tadepalli: వైఎస్‌ జగన్ క్యాంప్ ఆఫీసు వద్ద ఆంక్షల తొలగింపు

Jagan

Jagan

Tadepalli: మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న రోడ్ పై ఆంక్షలు తొలగించారు అధికారులు.. సాధారణ ప్రజలతో పాటు అన్ని రకాల వాహనాల రాకపోలకు ఆ రోడ్లో అనుమతి ఇస్తున్నారు పోలీసులు.. గతంలో రోడ్లకు ఇరు వైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు సిబ్బంది. దీంతో, ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రహదారి అందుబాటులోకి వచ్చింది.. కాగా, 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌.. ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. తాడేపల్లికి చెందిన వైసీపీకి చెందిన రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లు కట్టారు.. జగన్‌ ఇంటి పక్కనే భారీ విల్లాలను నిర్మించారు. ఇక, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఎంపిక చేయడంతో.. తాడేపల్లి, ఉండవల్లి మార్గంలో నివాసాలకు భారీ డిమాండ్‌ వచ్చింది.. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ఆ ఇంటినే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు వైఎస్‌ జగన్‌.. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రజలకు ఆ రోడ్‌లో ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు వైసీపీకి అధికారం చేజారడంతో.. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చాయి.

Read Also: Bihar : ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లోని ఆహారంలో పాము.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు