NTV Telugu Site icon

Diwali 2023: బీచ్ రోడ్డులో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. వైజాగ్‌ లా అండ్ ఆర్డర్ డీసీపీ

Vizag

Vizag

Diwali 2023: విశాఖలో దీపావళి సందడి మొదలైంది.. జోరుగా దీపావళి సామాగ్రి అమ్మకాలు జరుగుతున్నాయి.. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 150 క్రాకర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.. ఆ స్టాల్స్ ను పరిశీలించిన లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు.. కీలక సూచనలు చేశారు.. ఈ ఏడాది కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పక్కా పగడ్బంధీగా స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.. పోలీస్, జీవీఎంసీ, ఫైర్ సేఫ్టీ, ఏపీఈపీడీఎల్‌ డిపార్ట్మెంట్ లు సమన్వయంతో పర్యవేక్షణ చేస్తున్నాం.. ప్రతీ స్టాల్ వద్ద అగ్నిప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. గ్రౌండ్ వద్ద రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.

Read Also: Viral Video: ఇంటి దగ్గర భార్యాపిల్లలు లేరా.. నడిరోడ్డుపై ఏంటి ఈ సర్కస్ ఫీట్స్

ఇక, ఈ ఏడాది కూడా బీచ్ రోడ్డులో దీపావళి వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు. పర్యాటక ప్రదేశాలు, బీచ్ లో దీపావళి రోజు క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. క్రాకర్స్ కాల్చేటప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్లు, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి రోజు రాత్రి బీచ్ రోడ్డు లో ఆంక్షలు ఉంటాయి. దీపావళి ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాం.. మీరు ఆనందంగా జరుపుకొండి.. పొరుగువారికి ఇబ్బంది కలగకుండా మెసులుకోండి అని సూచించారు లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు.