NTV Telugu Site icon

Spain : రెస్టారెంట్ పైకప్పు కూలి.. నలుగురు మంది మృతి, 20 మందికి గాయాలు

New Project (69)

New Project (69)

Spain : స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ద్వీపం మజోర్కాలో రెస్టారెంట్ పైకప్పు కూలి నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అత్యవసర సేవలు తెలిపాయి. క్షతగాత్రులను పాల్మాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయని స్థానిక పోలీసు ప్రతినిధి తెలిపారు.

Read Also:Astrology: మే 24, శుక్రవారం దినఫలాలు

బహుశా అధిక బరువు కారణంగా పైకప్పు కూలిపోయి ఉంటుందని పోలీసు ప్రతినిధి తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. రాత్రి 8 గంటలకు మొదటి కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అత్యవసర సిబ్బంది తెలిపారు. పాల్మాలోని బీచ్‌లో జరిగిన ఘోర ప్రమాదం పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని ప్రధాని పెడ్రో సాంచెజ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. సాంచెజ్ తాను స్థానిక, ప్రాంతీయ అధికారులతో మాట్లాడానని, ప్రభుత్వం అవసరమైన అన్ని మార్గాలను తీసుకుంటోందన్నారు. దళాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read Also:Paralysis: పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి

సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. స్పానిష్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్రాడ్‌కాస్టర్ టీవీ ఛానెల్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు పాల్మాలోని మెడుసా బీచ్ క్లబ్‌లోని ప్రాంతాలను క్లియర్ చేయడానికి అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు పనిచేస్తున్నట్లు చూపించింది.