Rest Day in Test: ఇదేందయ్యో ఇది.. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి రోజు!
- క్రికెట్‌లో డ్రింక్స్ బ్రేక్ తెలుసు
- రిజర్వ్ డే గురించి కూడా తెలుసు
- టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి రోజు ఏంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rest Day in SL vs NZ Test Match: క్రికెట్‌లో మనం డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లను చూస్తుంటాం. అలానే రిజర్వ్ డే గురించి కూడా అందరికీ తెలుసు. అయితే విశ్రాంతి రోజు (రెస్ట్ డే) గురించి మాత్రం ఎవరికీ తెలీదు. మూడు దశాబ్దాల క్రితం ఉండే ఈ విశ్రాంతి రోజు.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. గత 30 ఏళ్లలో రెస్ట్ డే తీసుకున్న దాఖలు లేవు. అయితే ప్రస్తుతం గాలే వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
గాలే అంతర్జాతీయ స్టేడియంలో సెప్టెంబర్ 18న శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం అయింది. 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల ఆట ముగిసింది. శనివారం (సెప్టెంబర్ 21) నాలుగో రోజు ఆట జరగాలి. కానీ నాలుగో రోజును విశ్రాంతి రోజుగా ప్రకటించడంతో.. శనివారం మ్యాచ్ జరగలేదు. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఇక ఆది, సోమవారాల్లో మ్యాచ్ కంటిన్యూ కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్వదేశంలోనే ఉన్న శ్రీలంక క్రికెటర్లు సహా సహాయ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లంక క్రికెట్ బోర్డు విశ్రాంతి రోజును షెడ్యూలులో చేర్చింది.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’!
విశ్రాంతి రోజున శ్రీలంక క్రికెటర్లంతా వారి సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆటగాళ్లకు రవాణా ఏర్పాటు కూడా లంక క్రికెట్ బోర్డు అరేంజ్ చేసింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫాన్స్ ‘టెస్టుల్లో విశ్రాంతి రోజా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేందయ్యో ఇది.. ఇది నేనెప్పుడూ చూడలే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ టెస్టును రిషెడ్యూల్ చేయొచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడో షెడ్యూల్ అయింది. అంతేకాదు ఇరు జట్లు ఇతర సిరీస్‌లో ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో టెస్టును రీషెడ్యూల్ చేయడం అసాధ్యం. అందుకే మధ్యలో విశ్రాంతి రోజు ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!