విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య, సింగర్ కారుణ్య రాబోతున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు చేసిన కళాకారులు రాబోతున్నట్లు జీవీఎల్ పేర్కొన్నారు. దేశానికి సేవలందించిన వారిని సన్మానిస్తున్నట్లు తెలిపారు. రిప్లబిక్ వీకెండ్ లో జాతీయభావంతో కూడిన వినోదాన్ని విశాఖ వాసులు పొందాలని జీవీఎల్ తెలిపారు.
Read Also: YCP: ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి మరోసారి మార్పు..
కాగా.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని జీవీఎల్ చెప్పారు. మూడు సంవత్సరాలుగా విశాఖలో ఉన్న అనేక సమస్యలపై పని చేస్తున్నానని అన్నారు. స్థానిక ఎంపీ కంటే.. తాను విశాఖలో ఎక్కువగా పని చేస్తున్నానని అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అభివృద్ధితో పాటు ఆనందం కూడా ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో కూడా విశాఖలో అనేక కార్యక్రమాలు చేయనున్నామన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి ప్రజలు మూడ్ తో సంబంధం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు 30 ఎంపీ సీట్లు కూడా రావని విమర్శించారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే వారు అదోగతిపాలు అవుతున్నారని జీవీఎల్ తెలిపారు.
Read Also: France President: జైపూర్‌కు చేరుకున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్.. ప్రధాని మోడీతో కలిసి రోడ్ షో
