Site icon NTV Telugu

Republic Day Lighting: ఏపీ సచివాలయం, అసెంబ్లీకి రిపబ్లిక్ డే వెలుగులు

Ap5

Ap5

గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయింది. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్.గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఏపీ సచివాలయం.ఉదయం ఎంతో ఘనంగా జరుగనున్న 74 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంద్రప్రదేశ్ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. ఆంద్రప్రదేశ్ శాసన సభా భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్ లను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఇవి చూడడానికి రెండు కళ్ళుచాలడం లేదు.

Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్‌గా..

ఇదిలా ఉంటే రేపు సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోం జరగనుంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆతిధ్యం ఇవ్వనున్నారు గవర్నర్. రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు రాజ్ భవన్‌లో హై టీ. హాజరు కానున్న హైకోర్టు సీజే, ముఖ్యమంత్రి జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు. ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించింది రాజ్ భవన్. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఎట్ హోం కు హాజరయ్యారు చంద్రబాబు. రేపటి ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

Read Also: Shaakuntalam: ఋషివనంలో శకుంతలతో దుష్యంతుడి రొమాన్స్..

Exit mobile version