NTV Telugu Site icon

75th Republic Day 2024: ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

Delhi

Delhi

Republic Day 2024: ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 90 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మన సైనిక శక్తిని చాటడంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించనున్నాయి. జాతీయ వార్‌ మెమోరియల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శించడంతో వేడుకలు స్టార్ట్ అవుతాయి.

Read Also: Astalakshmi Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది

ఇక, ఢిల్లీ కర్తవ్యపథ్‌లో ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్‌ డే వేడుకలు ఆరంభం అవుతాయి. ఈ వేడుకలు జరిగే కర్తవ్యపథ్‌పై మిగ్‌-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి.. ప్రధాని మోడీతో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మతో కలిసి మార్కన్‌ రిపబ్లిక్‌ డే పరేడ్‌ను తిలకించనున్నారు. ఈ గణతంత్రి దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత సైన్యానికి చెందిన పలువురికి గ్యాలంట్రీ అవార్డులను అందించనున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలకు 8 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, కర్తవ్యపథ్‌లో 14 వేల మందితో పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది.

Show comments