రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన అనే వాళ్ళు ఉంటడం చాలా ముఖ్యం.. మిమ్మలిని చూసి గర్వ పడుతున్నా అని అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. అందరికీ న్యాయం చేస్తుందని తెలిపారు. ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ అయింది.. లేకుంటే కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారన్నారు. రేవంత్ దృష్టికి తీసుకుపోతాను.. న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రైతు బిడ్డగా సెలవుల్లో ఊరికిపోతే పల్లెటూరులతో చాలా అనుబంధం ఉందని చెప్పారు. చిన్నతనం పిల్లలతో కులమత బేధాలు లేకుండా పెరిగామన్నారు. తన సామాజిక వర్గం తెలియకుండా అమాయకంగా పెరిగినట్లు చెప్పారు. అన్ని కులాలను కలుపుకు పోయేది కమ్మ సామాజికవర్గం అని రేణుకాచౌదరి తెలిపారు.
World Kidney Day 2024: పిల్లలలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు.. ఈ సంకేతాల ద్వారా గుర్తించవచ్చు!
తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు అని రేణుకాచౌదరి అన్నారు. చాలా మంది తనను ఎన్టీఆర్ కూతురు అనుకునే వారు.. తమ అదృష్టం అలాంటి వారు తమ ముందు ఉండి దారి చూపించటమని తెలిపారు. ముందు చదువులకి ఆర్థిక శక్తి చాలా మంది దగ్గర లేదు.. రైతు పరిస్థితి బాగాలేదు.. కమ్మ వారిలో కూడా రైతు కూలీలు ఉన్నారు.. కమ్మవారికి ఈ కరువు సమయంలో కార్పోరేషన్ చాలా అవసరమని తెలిపారు. మనం పోయాక విగ్రహాలు కాదు ముఖ్యం.. మనం తీర్చి దిద్దే జీవితాలు శాశ్వతం అని రేణుకాచౌదరి పేర్కొన్నారు.
Dhanush: హమ్మయ్య ఎట్టకేలకు ధనుష్ వారి కొడుకే.. తేల్చేసిన కోర్టు
కమ్మ వారు పేరు చెప్పుకోవటానికి చెప్పుకోలేని పరిస్థితి ఉందని రేణుకాచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ ద్వేషి రాష్ట్రం ఏలుతూ.. పక్కన వారితో కమ్మలని తిట్టించే పరిస్థితి ఎందుకు వచ్చిందని దుయ్యబట్టారు. పౌరుషం పట్టుదల ఉన్న సామాజిక వర్గం తమది.. ఈరోజుల్లో అది చాలా ముఖ్యం అని తెలిపారు. మనం అందరం కలిసి కట్టుగా ఉంటే.. మనల్ని కాదు అనే ధైర్యం ఎవరికి లేదని రేణుకా చౌదరి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కూడా తన కొడుకుకి తారక రామారావు పేరు పెట్టుకున్నారు.. అంత గొప్ప మహనీయులు ఉన్నారు మన సామాజిక వర్గంలో అని తెలిపారు. తాను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని పోతాను.. వీలైతే మిమ్మలిని కల్పించే లాగా చూస్తానని కమ్మ సంఘం ప్రతినిధులకు భరోసానిచ్చారు.
