NTV Telugu Site icon

Election Commission: 8 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశాలు.. ఏ రాష్ట్రంలో అంటే..!

Poli

Poli

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రశాంతంగా ముగిసింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని సోమవారం ఆదేశించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2.00 గంటల మధ్య ఈ రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది. తూర్పు కమెంగ్ జిల్లాలోని బమెంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సరియో, కురుంగ్ కుమేలో న్యాపిన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లంగేతే లత్, దింగ్సర్, బొగియా సియుమ్, జింబారితోపాటు అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని నాకో అసెంబ్లీ నియోజకవర్గంలోని లెంగి కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Shocking Video: రేయ్ ఎవర్రా మీరంతా.. రోడ్డుపై వెళ్తున్న కారుకు వేలాడుతూ వెళ్తున్న వ్యక్తి.. చివరికి..

గత శుక్రవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. దీంతో ఈవీఎంలు సైతం దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఉన్నతాధికారులు నివేదిక అందించారు. అనంతరం ఎనిమిది కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలను ఈసీ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Lok sabha election: కమలానికి తొలి విజయం.. ఎక్స్‌లో బీజేపీ కీలక ప్రకటన

అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణా‌చల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల జరిగాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే 400 సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గుజరాత్‌లోని సూరత్‌ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు బీజేపీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: రేపే పిఠాపురంలో జనసేనాని నామినేషన్..

Show comments