NTV Telugu Site icon

Renuudesai : తన కొడుకు అకిరా నందన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్..

Whatsapp Image 2023 06 26 At 11.06.09 Pm

Whatsapp Image 2023 06 26 At 11.06.09 Pm

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా నందన్. చదువు పూర్తి అయ్యాక హీరోగాఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.. అకిరా నటన తో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. ఇక అకీరా కు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రేణు దేశాయ్.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అకీరా నందన్ జిమ్ చేస్తోన్న వీడియోను  పోస్ట్ చేశారు రేణు. అకీరా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటే బ్యాగ్రౌండ్ లో తెలుగు సినిమా పాటలు ప్లే అవుతున్నాయి.దీని పై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్ ను జత చేసింది.నేను జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో ఎప్పుడూ కూడా ఇంగ్లిష్ సాంగ్స్ ప్లే చేసేవారు. కానీ నేను హిందీలో సాంగ్స్ ప్లే చేయమంటే నన్ను ఓ చదువురాని దానిలా అందరూ చూసే వారనీ కానీ నేను అలాంటివి ఏమి పట్టించుకునే దాన్ని అయితే కాదు అని తెలిపింది. నేను అకీరాకు కూడా జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు మాతృ భాష లోనీ పాటలు వినమని చెప్పేదాన్ని అని ఆమె తెలిపింది.ఇప్పుడు అకీరా ఇలా తెలుగు మరియు హిందీ పాటలు వింటూ జిమ్ వర్కౌట్ చేస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని కామెంట్ చేసారు రేణు దేశాయ్.

Show comments