NTV Telugu Site icon

Renuka Chowdhury : షర్మిలపై కేసు పెట్టే దమ్ముందా..?

Renuka

Renuka

తనపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు వారిని కొట్టిన షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా అని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు. తాను ఏమీ చేయకుండానే గతంలో ఖమ్మంలో న్యూసెన్స్ కేసు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు షర్మిలపై ఎందుకు కేసు నమోదు చేయరన్నారు. ‘వెనకాల ఏం జరుగుతుందో?’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన వైఎస్‌ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్‌ కార్యాలయానికి వెళ్తున్నారనే సమాచారంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆమెను బయటకు రాకుండా నిలిపివేశారు పోలీసలు. అయితే.. దీంతో పోలీసులతో వైఎస్‌ షర్మిల వాగ్వాదానికి దిగడమే కాకుండా.. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను చేతితో పక్కకు నెట్టేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు.

Also Read : Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి

అంతేకాకుండా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వైఎస్‌ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా.. వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. సిట్‌ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్‌ షర్మిల కారును ఆపేందుకు యత్నిస్తుండగా, కానిస్టేబుల్‌ గిరిబాబుపై కారును ఎక్కించారు. పోలీసులపై షర్మిల దాడి చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ గిరిబాబును స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్‌ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బంజారాహిల్స్‌ పోలీసులు.

Also Read : Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..

Show comments