పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల పిల్లల గురించి అందరికి తెలుసు.. వీరి గురించి చిన్న వార్త వచ్చిన తెగ వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా శివరాత్రి సందర్బంగా ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
మహా శివరాత్రి పండుగ రోజున అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే. రేణు దేశాయ్ కూడా ఉపవాసం, జాగారణ చేసింది. తన పిల్లలు అకిరా, ఆద్యలతో కూడా ఉపవాసం, జాగారణ చేయించింది. రాత్రికి సద్గురు లైవ్ షో చూస్తూ ఓం నమః శివాయ అంటూ అకిరా, ఆద్య కూర్చొని దైవ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేశారు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో అఖిరా, ఆద్య ఇద్దరు ఓం నమ శివాయః అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆద్య, అకిరా నాతో కూర్చొని మెడిటేషన్ చేస్తూ జాగరణ చేశారు. పేరెంట్స్ గా మన కల్చర్ గురించి చెప్పి వాళ్ళని బాధ్యత గల వ్యక్తులుగా చేయడం మన బాధ్యత.. ఉదయం నుంచి కూడా నాతో పాటే నీళ్లు తాగుతూ కటిక ఉపవాసం ఉన్నారు అంటూ రేణు రాసుకొచ్చింది.. పండగల గురించి చెప్తూ ఇలాంటి నేర్పిస్తుందుకు రేణు పై పవన్ ఫ్యాన్స్ సైతం అభినందనలు తెలుపుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
