NTV Telugu Site icon

NTA: ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ తొలగింపు..

New Project (10)

New Project (10)

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఐఏఎస్ ప్రదీప్ సింగ్ ఖరోలా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రదీప్ సింగ్ ఖరోలా కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా ఉన్నారు. ఇటీవలి NEET పేపర్ లీక్ మరియు UGC-NET పరీక్ష పేపర్ లీక్ సమస్యకు సంబంధించి NTAపై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పేపర్ లీక్‌పై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరంతరం ప్రశ్నలు వేస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.

READ MORE: Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు

నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్‌లో సూత్రధారిగా ఉన్న రవి అత్రిని ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసన చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని నీమ్కా గ్రామానికి చెందిన అత్రి, వైద్య విద్యలో అత్యంత పోటీ పరీక్ష అయిన నీట్ వ్యవహారంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాడు.