NTV Telugu Site icon

Hyderabad Metro: నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. తిరగబడ్డ వాహనదారులు!

Nagole Metro

Nagole Metro

Hyderabad Metro: నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, ధరలు నిర్ణయించారు. బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10.. 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30.. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు.

Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..

మెట్రో స్టేషన్‌ వద్ద ఉచిత పార్కింగ్‌ ఉన్నట్టుండి ఎత్తివేయడం వివాదానికి దారి తీసింది. నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అన్ని చెప్పడంతో వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటుండగా.. గురువారం నుంచి ధరలు నిర్ణయించగా.. వాహనదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పైగా పార్కింగ్ చేసుకోవడానికి ‘పార్క్‌ హైదరాబాద్‌’ అనే యాప్‌ నుంచి చేయాలని కండిషన్ పెట్టారు. ఆ యాప్‌ గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు అనుమతించకపోవడంతో చాలా మంది వాహనదారులు వారిపై తిరగబడాల్సి వచ్చింది.

.