NTV Telugu Site icon

Hyderabad: HCA పరిధిలోని 57 క్రికెట్ క్లబ్స్ పై వేటు

Hca

Hca

గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హెచ్‌సీఏ ఏకసభ్య కమిటీ సభ్యుడు లావు నాగేశ్వరరావు తన పని ప్రారంభించారు. బహుళ క్లబ్‌ లతో హెచ్‌సీఏను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దలకు సుప్రీం కోర్టు గట్టిగానే షాకిచ్చింది. ఇందులో భాగంగా.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న HCA పరిధిలోని 57 క్రికెట్ క్లబ్స్ పై వేటు వేసింది.

Read Also: Andhrapradesh Crime: దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను కొట్టి చంపిన భర్త

పలు అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ క్లాబ్స్ పై కమిటీ వేటు వేసింది. 80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది గుర్తించి.. ఆ 12 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు హెచ్సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. అందుకోసమే.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయా క్లబ్ల్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించింది. జీహెచ్ఎంసీకి చెందిన 21 క్లబ్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు కమిటీ గుర్తించింది.

Read Also: Ambati Rambabu: రచ్చకెక్కిన BRO శ్యామ్ బాబు.. ఢిల్లీకి బయలుదేరిన అంబటి

ఆడిందే ఆటగా సాగుతున్న క్రికెట్ క్లబ్స్ కి జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ చెక్ పెడుతుంది. క్లబ్ల్స్ అరాచకాలు, అవినీతి చిట్టాను బయటకు కమిటీ లాగుతుంది. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో పాల్గొనకుండా… ఓటు హక్కు వినియోగించకుండా నిషేధం విధించింది. నిషేధానికి గురైన వారిలో శేష్ నారాయణ, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, ప్రకాష్ చంద్ జైన్, అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, విక్రమ్ మాన్ సింగ్, స్వరూప్, విజయానంద్, జాన్ మనోజ్ సహా పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు.