NTV Telugu Site icon

Health Tips: ఒంట్లో వేడి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించండి

Heat

Heat

Remedies to Reduce Heat in the Body: కొంతమందికి తరుచుగా ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది. దీని కారణంగా జ్వరం రావడం, తలనొప్పి, నోటిలో పుండ్లు ఏర్పడటం, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వానకాలంలో చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మాన్ సూన్ డైట్ లాంటివి చేయాలి. వేడి తగ్గించే పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు లాంటివి తీసుకోవాలి. శరీరంలో వేడి రావడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేట్అవడం. అలా అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీరం టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది.

Also Read: Eye Health: ఇక కళ్లజోడుకు బై బై.. వీటితో కంటిచూపును మెరుగుపరుచుకోండి

వేడి తగ్గించడంతో మెంతులు కూడా మంచిగా ఉపయోగపడతాయి. ఒక స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి నుంచి త్వరగా ఉపశనమనం లభిస్తుంది. మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే వెంటనే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల శరీరంలో వేడి పెరిగినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు గాలి బాగా ఉన్న చోటనే కూర్చోవాలి. ఫ్యాన్ కింద, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు ఉండాలి. ఇక స్విమ్మింగ్ (ఈత కొట్టడం) వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అందుకే వేసవిలో చాలా మంది ఈత కొట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అధిక వేడి పుడుతుందని తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భాల్లో మాత్రం డాక్టర్ ను కచ్ఛితంగా సంప్రదించాలి. కొన్ని సందర్భాలలో దీనివల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. తినేటప్పుడు కూడా మజ్జిగ, లస్సీలాంటివిని వెంటనే వేడిని తగ్గి్స్తాయి. అలాగే కొబ్బరి నీరు చాలా మంచి ఔషధం. తియ్యటి కొబ్బరి నీరు కాకుండా కొంచెం వగరుగా ఉండే వాటిని ఎంచుకోవాలి.