NTV Telugu Site icon

Stone Quarry: మిజోరంలో భారీ వర్షాలతో కూలిన గ్రానైట్‌ క్వారీ.. 10 మంది మృతి

Mizoram

Mizoram

Stone Quarry Collapse In Mizoram: మిజోరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ కూలిపోవడంతో 10 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్య్కూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని కోరిట్లు ప్రభుత్వం వెల్లడించారు.

Read Also: Tummala Nageswara Rao: నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్..

ఇక, కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను సైతం మూసివేసినట్లు అధికారులు చెప్పారు. ఇక, జాతీయ రహదారి 6పై కొండ చరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Show comments