NTV Telugu Site icon

Pooja Khedkar Mother: పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్..! బెయిల్ మంజూరు

Manorama

Manorama

భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే రూరల్ పోలీసులు మనోరమ.. ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ కోసం వెతకడం గమనార్హం.

Read Also: CM Chandrababu: సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

దీంతో పోలీసులు ఖేద్కర్ దంపతులతో పాటు మరో ఐదుగురిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 307, 144, 147, 506 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టంలోని సెక్షన్లు కూడా ఆమెపై విధించారు. ఈ కేసులో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమను రాయ్‌గఢ్ జిల్లా మహద్ సమీపంలోని హిర్కానివాడి గ్రామంలోని లాడ్జిలో పట్టుకున్నారు. మరోవైపు ఈ కేసులో దిలీప్ ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.

Read Also: Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్‌.. మీ డీపీ ఇక సేఫ్‌..

ఇదిలా ఉంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేసులో పూజా ఖేద్కర్‌కు బుధవారం పెద్ద దెబ్బ తగిలింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేశామని, భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను డిబార్ చేశామని UPSC తెలిపింది. దాంతో పాటు.. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ క్రమంలో.. ఏదో సమయంలో ఢిల్లీ పోలీసులు పూజా ఖేద్కర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.