NTV Telugu Site icon

Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం

Inflation

Inflation

Retail Inflation :భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2023 నాటికి ఐదు శాతానికి తగ్గుతుంది. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. నివేదిక ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్ణయించిన 6 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అంచనా.జనవరి-మార్చి 2023లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంది. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంగా ఉంది. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.డిసెంబర్ తో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గుముఖం పట్టనుంది.రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.77 శాతం నుంచి నవంబర్‌లో 5.88 శాతానికి తగ్గింది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబరు వరకు మూడు త్రైమాసికాల్లో 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువ.

Read Also: Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్

ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం ఏమిటి?
2022 డిసెంబర్‌లో సీపీఐ(కస్టమర్ ప్రైజ్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్ట స్థాయి 5.72 శాతానికి చేరుకుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. కూరగాయల ధరలు భారీగా తగ్గడం వల్లనే ఇలా జరిగిందని ఆయన అన్నారు.ఎందుకంటే రైతులు పంట వేసే విధానంలో పెద్ద మార్పు కనిపించింది. అనుకూల వాతావరణంతో సాంకేతికత అంచనా ప్రకారం రైతులు పంటలు సాగుచేశారు. డిసెంబరు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా ఉంది. నవంబర్‌తో పోల్చితే స్వల్పంగా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. డేటా ప్రకారం, దేశ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.72 శాతంగా ఉంది.నవంబర్ నెలలో ఈ సంఖ్య 5.88 శాతంగా ఉంది.ఇప్పుడు దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. తక్కువ ఆహార ధరలు, ముఖ్యంగా కూరగాయలు, ద్రవ్యోల్బణాన్ని సహించే స్థాయిలో ఉంచడంలో సహాయపడ్డాయి.ద్రవ్యోల్బణం కట్టడిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరులో 4.19 శాతానికి తగ్గింది.అంతకు ముందు నెలలో ఇది 4.67శాతంగా ఉంది.