Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retail Inflation :భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2023 నాటికి ఐదు శాతానికి తగ్గుతుంది. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. నివేదిక ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్ణయించిన 6 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అంచనా.జనవరి-మార్చి 2023లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంది. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంగా ఉంది. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.డిసెంబర్ తో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గుముఖం పట్టనుంది.రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.77 శాతం నుంచి నవంబర్‌లో 5.88 శాతానికి తగ్గింది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబరు వరకు మూడు త్రైమాసికాల్లో 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువ.
Read Also: Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం ఏమిటి?
2022 డిసెంబర్‌లో సీపీఐ(కస్టమర్ ప్రైజ్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్ట స్థాయి 5.72 శాతానికి చేరుకుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. కూరగాయల ధరలు భారీగా తగ్గడం వల్లనే ఇలా జరిగిందని ఆయన అన్నారు.ఎందుకంటే రైతులు పంట వేసే విధానంలో పెద్ద మార్పు కనిపించింది. అనుకూల వాతావరణంతో సాంకేతికత అంచనా ప్రకారం రైతులు పంటలు సాగుచేశారు. డిసెంబరు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా ఉంది. నవంబర్‌తో పోల్చితే స్వల్పంగా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. డేటా ప్రకారం, దేశ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.72 శాతంగా ఉంది.నవంబర్ నెలలో ఈ సంఖ్య 5.88 శాతంగా ఉంది.ఇప్పుడు దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. తక్కువ ఆహార ధరలు, ముఖ్యంగా కూరగాయలు, ద్రవ్యోల్బణాన్ని సహించే స్థాయిలో ఉంచడంలో సహాయపడ్డాయి.ద్రవ్యోల్బణం కట్టడిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరులో 4.19 శాతానికి తగ్గింది.అంతకు ముందు నెలలో ఇది 4.67శాతంగా ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!