Site icon NTV Telugu

Reliance Jio: గేమర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.48 ప్రారంభ ధరతో కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్..!

Jio Games

Jio Games

Reliance Jio: భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో గేమింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐదు కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌ లతో జియో గేమ్స్ క్లౌడ్ కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. ఇక JioGames Cloud అనేది జియో సంస్థ అందిస్తున్న క్లౌడ్ గేమింగ్ సర్వీస్. ఇందులో వినియోగదారులు PC, జియో సెటప్ బాక్స్ (Jio STB), స్మార్ట్‌ఫోన్‌ వంటివి ఉపయోగించి ప్రీమియం గేమ్‌లను డౌన్‌లోడ్ అవసరం లేకుండానే ఆడవచ్చు. ఈ క్లౌడ్ గేమింగ్ సర్వీస్‌కు ప్రో పాస్ ధర రూ.398 (28 రోజుల వ్యాలిడిటీతో) కాగా, తాజా ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అది ఉచితంగా అందనుంది.

Read Also: Protein Foods: శరీరానికి ప్రోటీన్ అందాలంటే వీటిని తినాల్సిందే..!

ఇకపోతే తాజాగా.. రిలయన్స్ జియో గేమింగ్ ప్రియుల కోసం ఐదు కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఇందులో రూ. 48 ప్లాన్‌కి 10MB డేటాతో పాటు JioGames Cloud సర్వీసు 3 రోజుల పాటు అందించబడుతుంది. ఈ ప్లాన్‌కి మొత్తం వ్యాలిడిటీ కూడా 3 రోజులు మాత్రమే. అలాగే రూ. 98 ప్లాన్‌లో కూడా 10MB డేటా లభిస్తుంది. కానీ, ఇది 7 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో JioGames Cloud యాక్సెస్ 7 రోజులు లభిస్తుంది. అయితే, ఇది డేటా వోచర్ కాబట్టి ఇది పనిచేయాలంటే బేసిక్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం ఉంటుంది.

Read Also: TVS Jupiter 125: సరికొత్త స్టైల్, పవర్, పర్ఫార్మన్స్ లతో లాంచ్‌కు సిద్ధమైన కొత్త టీవీఎస్ జూపిటర్ 125..!

రూ. 298 ప్లాన్‌కి 3GB డేటా, 28 రోజుల JioGames Cloud యాక్సెస్ లభిస్తుంది. ఇది కూడా డేటా వోచర్‌గా కాబట్టి, బేసిక్ ప్లాన్ అవసరమవుతుంది. అలాగే రూ. 495 ప్లాన్‌కి రోజుకు 1.5GB డేటాతో పాటు అదనంగా 5GB డేటా లభిస్తుంది. ఇది అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS‌లు అందిస్తుంది. అదనంగా JioGames Cloud, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, FanCode, JioTV, JioAICloud వంటివి ఈ ప్లాన్‌లో లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇక చివరగా రూ. 545 ప్లాన్‌కి రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 5GB బోనస్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMS లభిస్తాయి. ఇందులో JioGames Cloud, హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, FanCode, JioTV, JioAICloud వంటి అనేక అదనపు ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లు గేమింగ్ ప్రియులకు క్లౌడ్ గేమింగ్ అనుభూతిని సులభంగా అందిస్తాయి.

Exit mobile version