NTV Telugu Site icon

Reliance Jio: జియో బంపరాఫర్‌.. ఈ ప్లాన్‌పై 10 జీబీ డేటా..

Jio

Jio

Reliance Jio: అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది రిలయన్స్‌ జియో.. ఇక ఎప్పటికప్పుడు తన యూజర్లకు ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది.. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు.. పాత వినియోగదారులకు కూడా ఆఫర్లు ఇస్తోంది.. టాటా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న క్రమంలో ఉచితంగా అదనపు డేటా ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న ధరకే అదనగా 4 జీబీ డేటా అందిస్తోంది. జియో రూ. 61 డేటా బూస్టర్ రీఛార్జ్ ప్లాన్‌పై ఇప్పటి వరకు 6 జీబీ డేటా ఇస్తుండగా.. ఇప్పుడు 10 జీబీ డేటాను అందిస్తోంది.. అంటే 4 జీబీ డేటా అదనంగా ఇస్తుందన్నమాట..

అయితే, ఈ రోజు క్వాలిఫయర్‌లతో ప్రారంభమయ్యే ఐపీఎల్ చివరి వారంలోపు ఈ డీల్‌ను తీసుకొచ్చింది జియో.. టెలికాం ఆపరేటర్ రూ. 15 నుండి మొత్తం ఐదు డేటా బూస్టర్‌లను అందిస్తుంది. Jio డేటా బూస్టర్ ప్యాక్‌లు ప్రైమరీ ప్యాక్ పైన అదనపు డేటాను అందిస్తాయి, ప్రత్యేకంగా ఎక్కువ డేటా అవసరమైనప్పుడు ఇవి ఉపయోగరకంగా ఉంటాయి.. జియో యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రూ.61 డేటా బూస్టర్ ప్లాన్ మాత్రమే. అంటే మీరు మీ జియో సిమ్‌పై యాక్టివ్ రీచార్జ్ ప్లాన్ కలిగి ఉంటేనే ఇది వర్తిస్తుంది. అంటే నెల రోజులు లేదా ఆపైన ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.

అంటే, యాక్టివ్ ప్లాన్ రోజు వారీ డేటా అయిపోతే అప్పుడు డేటా బూస్టర్ ప్లాన్ కింద వచ్చే అదనపు డేటాను వాడుకునే వీలున్న విషయం విదితమే.. రోజు వారీ డేటా అయిపోయిందన్న చింత లేకుండా అదనపు డేటా పొందేందుకు ఈ బూస్టర్లను తీసుకొచ్చింది జియో.. రిలయన్స్ జియో రూ.15 ప్యాక్‌తో 1 జీబీ డేటా వస్తుంది. అదే రూ.25 ప్లాన్ అయితే 2 జీబీ డేటా పొందవచ్చు. రూ.61 రీచార్జ్ ప్లాన్‌తో గతంలో 6 జీబీ డేటా వస్తుండగా దానిని ఇప్పుడు 10 జీబీకి పెంచేసింది ఆ సంస్థ.. ఇక, రూ.121 ప్లాన్‌పై 12 జీబీ, రూ.222 రీచార్జ్ పై 50 జీబీ డేటా అందిస్తోంది. ఇక, Jio రూ. 999, రూ. 399, రూ. 219 అపరిమిత క్రికెట్ ప్లాన్‌లు, అదనపు ఉచిత డేటా వోచర్‌లను కూడా అందిస్తోన్న విషయం విదితమే..